99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Friday, September 29, 2006

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నా కవితలు

నీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీ
నా మనసున నీ రూపుని..చిరకాలం నిలిచిపొమ్మనీ!!
---------------------------------------------------


నిను చూడని ఒక్క క్షణం కను రెప్పలు కలవరించనే
నిను తలువని ప్రతి నిముషం యెదలయలే గతిని తప్పెనే.
-----------------------------------------------------------
దయరాదా దాసుడిపై ఇకనైనా ఓ మనసా
వినరాదా విన్నపమే ఇపుడైనా ఓ మనసా!
తప్పేదో జరిగుందని నే తలవంచాను కదా
ఆ నేరాలను మన్నించి నను చేరుకోరాదా!!
----------------------------------


వలపన్నది వరమని ఇపుడేగా తెలిసింది
వగపన్నది విషమని ఈ దూరమే తెలిపింది
నిను పిలువని పెదవులకే పదములు రాకున్నవి
నిను తలువని కన్నులకే ఊహలు కరువైనవి !!
------------------------------------------------------
మనసా ప్రేమంటే తెలుసుకో..
జీవితాన్ని అందంగా మలుచుకో..
మదిలోని భావాలని అర్ధంచేసుకో..
కు నచ్చిన వారి హృదయాన నిలిచిపో..
నీ మది మెచ్చిన వారి ప్రేమను...
ఎప్పటికైనా అందుకో.
-------------------------------


ఎన్నో రోజుల మౌనమది - ఒక్కసారి వీడినది,
ఎమిటో తెలియని బందమది - సాయం కోరినది,
కాదనలేని నా మది - సరె రమ్మన్నది,
జీవం లేని ప్రేమ అది - నన్ను మోసం చేసినది.
------------------------------------------------------------


నీ రాకలోని ఆనందం...
నా కన్నుల వెలుగై నిను చేరటం లేదా,
నీ నిష్క్రమణలోని ఉదాసీనం..
చిమ్మ చీకటై నిను ఆపటం లేదా,
నా ఆనందం నా పెదవులపై..
చిరునవ్వుతో తెలియటం లేదా,
నా ఈ ఉదాసీనం..చెమ్మ గిల్లిన..
నా కన్నులు చెప్పటం లేదా.
----------------------------------

0 Comments:

Post a Comment

<< Home

OrkutPix.com™