లబ్... డబ్...
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో,
నువ్వు లేనప్పుడు నీ ఎదురుచూపులో.
నీ కనుల భాషతో నా హృదయానికి,
మాటలు నేర్పావు.
ఎక్కడికి వెళ్ళి పోయావు ప్రియా....
ఒక్క చిరునవ్వుతొ ప్రేమను పుట్టించావు,
కుదరదని కంట నీరు తెప్పించావు.
చేయలేదు నేను ఈ పొరపాటు,
ఎందుకు నాకీ ఎడబాటు.
చిరునవ్వుల వరమిస్తావా...
చితినుంచి నడిచి వస్తాను.
మరు జన్మకి మాటిస్తావా..
ఈ క్షణమే మరణిస్తాను.
నీవు నా చెంత లేవని,
నా మనసు రాయి చేసుకుంటే,
ఆ రాయి పైన అందమైన నీ రూపం శిల్పంగా మారితే,
నేనెమి చేసెది ప్రియా !.......






0 Comments:
Post a Comment
<< Home