నా కవితలు
నీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీ
నా మనసున నీ రూపుని..చిరకాలం నిలిచిపొమ్మనీ!!
---------------------------------------------------
నిను చూడని ఒక్క క్షణం కను రెప్పలు కలవరించనే

నీ పెదవుల చిరునవ్వుని..కలకాలం ఉండనివ్వనీ
గుప్పెడు గుండె నిండ సముద్రాలు...

నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో,



నా మనసులోని ప్రేమ ఎంతో ....నాకే తెలియదు,
ఇప్పుడు నీ ప్రేమ, అనురాగం ..దూరం కాగనే,
నా హృదయంలోని భావాలు..
నన్ను కవితలు రాయమని ప్రేరెపిస్తున్నాయి.
ప్రియా..
నిను చుసిన క్షణం,సాగి పోయే కాలన్ని..
ఆగి పొమ్మన్ని చెప్పన,
నీడ లాగ నాలో కలిసి పొమ్మని చెప్పన.
చివరికి నీ మదిలో కలగా ఒదిగి పొమ్మని చెప్పన
నిను చుసినా క్షణం,
తలచుకుంటాను ప్రతి క్షణం.
ఎందుకో తెలియని అయోమయం,
వేదిస్తుంది నన్ను అణుక్షణం.
పదె పదె తపిస్తుంది,నీ కొసం నా హృదయం.
నా గుండెలో తన శబ్దం,
నా శ్వాసలో తన స్పర్ష,
నా పెదలపై తన పేరు,
నా కనులలో తన రూపం,
అందమైన తన చిరునవ్వు,
ఆ నవ్వులోని అందమే నా ఆనందం.
నీ పరిచయం...నిదురపోతున్న,
నా మనసుకి సుర్యోదయం.
నీ కలయిక ...కలిసి రాని,
నా జీవితానికి మిగిలిన జ్ఙాపిక.
పరిచయం అనే మొక్కకు,
అభిమానం అనే నీరు పొస్తే..
స్నేహం అనే పువ్వు పూస్తుంది.
స్నేహం అనే మొక్కకు,
ఇష్టం అనే నీరు పొస్తే..
ప్రేమ అనే పువ్వు పూస్తుంది.