Telugu Poetry

Saturday, November 18, 2006
Monday, November 13, 2006
ప్రేమ కోసం
నన్ను ప్రేమించమని నిన్ను వేధించలేను..
ప్రేమ విలువ తెలిసినదాణ్ణి కాబట్టి!!
నీ ప్రేమను వేడుకోనూ లేనూ..
ఆత్మాభిమానం మెండు కాబట్టి!!
అలా అని వదులుకోనూ లేను..
ఆకర్షణ ముంగిట్లో నిలిచాను కాబట్టి!!
నీ మనసును గెలవడానికి..వేచిఉండటం
తప్ప ఏమి చేయలేని నిస్సహాయురాలిని...
లబ్..డబ్..

ఓ..ప్రియతమా..నా ఆరోప్రాణమా,
పారిజాత పుష్పమా, పాలరాతి శిల్పమా..
తెలుపుమా..నీ చిరునామా.
--------------------------------------------
నీవు లేని ఈ ఒంటరితనంలో..
ప్రతీ నిమిషం నీ జ్ఞాపకాలే.
----------------------------------------------
జలపాతల మధ్య నేనున్నా..
నా తోడు నువ్వు లేకుంటే..
ఎడారైపోదా నా జీవితం.
---------------------------------------------
ఎన్ని జన్మలదో ఈ బంధం..
నిన్ను వీడనంటుందీ ప్రాణం.
----------------------------------------------
ఎప్పుడో ఒకసారి నువ్వు
నా దగ్గరికి వస్తావు క్షమించమని..
నీకలాంటీ బాధ కలిగినా..
వేదన చెందుతాను.
నిన్ను అంతగా ప్రేమిస్తున్నను మరి.
========================
Saturday, November 11, 2006
లబ్.. డబ్..
ప్రతీ క్షణం నీకు దురమవుతున్నానని అనుకున్నా..
కానీ నీ ఆలోచనలతో నీకు మరింత చెరువవుతున్నా.
దూరమన్నది లేనేలేదు మనసుకు అంతా చేరువే..
ఉన్న చోటు వేరైనా నా మనసెప్పుడు నీ దగ్గరే.
నేస్తమా అని పలకరించే హృదయం నీకుంటే..
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా.
నా మనసు
నిను చూడని ఒక్క క్షణం...
కను రెప్పలు కలవరించనే.
నిను తలువని ప్రతి నిముషం...
ఎద లయలే గతినితప్పెనే.
నువు చేసిన బాసలతో....
చేజారిన కలలెన్నో.
నీ తీపి గురుతులతో....
ఎద నిండా అలలెన్నో.
చిరు గుండెల చప్పుడులో....
వినిపించనీ ఈ హోరు.
కనిపించని శత్రువుతో....
కడదాక నా పోరు.
Friday, November 10, 2006
Tuesday, November 07, 2006
స్నేహం
పొంగిపొర్లుతున్న ఆలోచనను అక్షరాలతో
కట్టిపడేస్తే...అది కవిత !
ఊహకు రంగులు జోడిస్తే...అది చిత్రం !
శిలను చిత్రిక పడితే...అది శిల్పం !
స్నేహానికి ప్రాణం పోస్తే...అది నువ్వు !!








