99galleries.com

zwani.com myspace graphic comments

Created by Crazyprofile.com

Sunday, June 17, 2007

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

ఓ ప్రియతమా....

ఓ ప్రియతమా....

వికసించే పుష్పం నువ్వైతే..

విరజిమ్మే సుగంధం నేనవుతా..

అలరించే గానం నీవైతే...

ఆకర్షించే గాత్రం నేనవుతా...

పయనించే పయనం నీవైతే..

కనిపించే మార్గం నేనవుతా..

పలికించే మౌనం నీవైతే..

విలపించే వేదన నేనవుతా..

చిందించే చిరునవ్వు నీవైతే..

చిగురించే పదవి నేనవుతా..

ఓ ప్రియతమా..

నా ఈ చిరు కవిత నీ కోసం...

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

మన స్నేహామే ముద్దు.......

ఆచరణలు లేని ఆలోచనలు మనకొద్దు..

అంతేలేని ఆ నింగే మన హద్దు..

మన జీవితాలతో చెలగటమాడే...

ఈ ప్రేమలు మనకొద్దు...

కమ్మని కలలను చూపే కనులకి...

కన్నిళ్ళు నేర్పే ఈ ప్రేమ మనకొద్దు...

మన అంతరంగాలని పంచుకునే...

మన స్నేహామే ముద్దు.......

జీవితపు తెరలలో..తీపి గురుతుల కాగితం మన స్నేహాం..

నీలి ఆకాశపు నీడలో...మన పరుగులు..

చిలిపి అల్లర్లు...చిన్ని చిన్ని కలహాలు...

మరుక్షణం కలయికలు..మన స్నేహాపు రోజులు...

జీవిత రహదారిలో..మరోసారి ఆ మైలురాయిని తాకగలమా??

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

గుండే చప్పుడు...

కళ్ళు ముస్తే కలలో...

కళ్ళు తెరిస్తే ఇలలో...

ప్రతీ పువ్వులో నీ నవ్వు...

అనుక్షణం కవ్విస్తుంటే..

స్పందిస్తున్న ఈ గుండే చప్పుడు...

నీకు వినిపించెదెప్పుడు..???

నువ్వు ఉన్నప్పుడు నీ చూపూలో...నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపూలో...

..~..~..మిచాలి అర్లెన్ - బుద్ధిని పాడుచేయడానికి..హృదయం ఆడే ఆట..~..~..

నేస్తమా.....

నీ రూపం చూపని కనులెందుకు...

నీ పలుకులు వినపడని హృదయం ఎందుకు...

నీ పరిమలం అందించని శ్వాస ఎందుకు...

నీ వైపు నడవని ఈ అడుగులు ఎందుకు...

నీతో సాగని ఈ కాలం ఎందుకు...

నీకు చెందని ఈ స్నేహాం ఎందుకు...

నా మనసులో మెదిలే భావమా..

నా కవితలో కదిలే కావ్యామా..

అడుగున అడుగై నడవాలి...

పదమున పదమై పాడాలి...

నింగిన వెలిగే చందమామ....

నేలకు వచ్చిందనిపించాలి...

ఉరుముతో వచ్చే మెరుపువై...

నన్ను తలపించాలి....

నన్ను నడిపే కాంతివై నావేంటే ఉండాలి...

మన స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలి...

జీవితం లో స్నేహం...

ఒక తీయని బందం..

గుర్తుండాలి కలకాలం..

అప్పుడే మనసుకు ఆనందం...

స్నేహం లో ఏడాబాటు భాదే కాదా???

ఇక మనం కలిసే రోజు రానే రాదా?????

OrkutPix.com™