..~..నువ్వు ..~...

నీ పరిచయం..ఆనందంలోని అందం చెప్పింది...
నీ చూపు ...చిరునవ్వులోనే సంతోషాన్ని చెప్పింది..
నీ తలపు..మదిలోని వెలితిని మాయం చేసింది..
నీ అనుబంధం..శిలవంటి మనసును శిల్పం చేసింది..
నీ విరహం.. నన్ను నాలో లేకుండా చేసింది..
నీ వియోగం...నా ప్రాణాన్ని నాకు దురం చేస్తుంది..
అందుకే నువ్వు ఒక్కసారి వచ్చిపో..
నన్ను నాలో నింపిపో...






