Telugu Poetry

Friday, August 31, 2007
గుర్తుకోస్తున్నాయి...

మనసులోని భావాలెన్నో....
మరువలేని గాయాలెన్నో....
వీడలేని నేస్తాలెన్నో.....
వీడిపోని బంధాలెన్నో....
మరపురాని పాటలెన్నో....
మధురమయిన క్షణాలెన్నో....
కవ్వించే కబుర్లెన్నో....
మాయమయ్యే మార్పులెన్నో.....
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో....
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో....
ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నో....
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో...
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో....
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో....
మన జీవితంలో మరువలేని జ్ఞాపకాలెన్నో.............







